Airtel: ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్, రూ. 149 చెల్లిస్తే 15 రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ చూడొచ్చు, ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌లో మార్పులు చేసిన దిగ్గజం

రూ.149 ప్రీపెయిడ్‌ ప్లాన్‌కే 15 రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను వీక్షించే అవకాశం కల్పించింది. ఎయిర్‌టెల్‌ ఇటీవల ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌లో మార్పులు చేసిన సంగతి విదితమే.

Bharti Airtel. (Photo Credits: Twitter)

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ యూజర్లకు బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.149 ప్రీపెయిడ్‌ ప్లాన్‌కే 15 రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను వీక్షించే అవకాశం కల్పించింది. ఎయిర్‌టెల్‌ ఇటీవల ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌లో మార్పులు చేసిన సంగతి విదితమే. మార్పులకు అనుగుణంగా యూజర్లు క్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వారికి నచ్చిన ప్రోగ్రామ్స్‌ చూసి ఎంజాయ్‌ చేయొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి, సెకండ్లలో మీ ఫోన్‌కి మెసేజ్

ఎయిర్‌టెల్‌ రూ.149తో 1జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఒకే యాప్‌లో 15 రకాల ఓటీటీలను వీక్షించవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ డేటా వోచర్‌తో పాటు ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌లో ఇతర అన్నీ రకాల బెన్ఫిట్స్‌ పొందవచ్చు. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు.. టీవీ, పీసీల్లోనూ యాప్‌కు యాక్సెస్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌లో సోనీలివ్‌, లయన్స్‌గేట్‌ప్లే, హొయ్‌చొయ్‌, చౌపల్‌, కచ్చాలంకా, ఈరోస్‌నౌ, మనోరమామ్యాక్స్‌, హంగామా, డాక్యూబే వంటి ఓటీటీ కంటెంట్‌ను వీక్షించవచ్చు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif