Google Extends Work From Home: 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రం హోం, డెల్టా వేరియంట్ ముప్పుతో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్
తాజాగా దీనిపై నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని (Google Extends Work From Home) నిర్ణయించింది.
వర్క్‌ఫ్రం హోం కొనసాగించడంపై తర్జనభర్జన పడుతున్న కార్పోరేట్ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని (Google Extends Work From Home) నిర్ణయించింది.
ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్ఛికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ (Sundar Pichai) కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. 2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలా ?, ఆఫీసులకు వచ్చి పని చేయాలా ? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కరోనా విజృంభనతో (Coronavirus Cases Rise) కార్పోరేట్ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేశాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలంటూ చెప్పాయి. అయితే వర్క్‌ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. గూగుల్ సైతం సెప్టెంబరు మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. తాజాగా వర్క్‌ఫ్రం హోంపై ఈ కంపెనీ కీలక ప్రకటన చేసింది.
కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభణకు తోడు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఉద్యోగులు అయిష్టత చూపుతున్నందున ఇప్పటికే అమెజాన్ , లైఫ్ట్ వంటి సంస్థలు వర్క్‌ఫ్రం హోంను కొనసాగిస్తామని ప్రకటించాయి.