Google Fined: గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా, చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు రూ.260 కోట్లు ఫైన్ వేసిన దక్షిణకొరియా
కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ (Gaming APP) మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంద సంస్థలు అవకతవలకు పాల్పడినట్లు గుర్తించింది
New Delhi, April 13: టెక్ దిగ్గజం గూగుల్‌కు (Google Fined) దక్షిణ కొరియాకు (South Korea) చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ (South Koreas Anti Trust Regulator) రూ.260 కోట్ల భారీ జరిమాన విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ (Gaming APP) మార్కెట్‌లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంద సంస్థలు అవకతవలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్‌లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (FTC) ప్రకారం గూగుల్ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డుకుంది.
వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్‌లో ఫీచర్డ్‌గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది.
ఇప్పటికే ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఏకో సిస్టమ్ కేసునకు సంబంధించి సీసీఐ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ ట్రిబ్యునల్‌ను (NCLAT) ఆశ్రయించిన గూగుల్‌కు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది అక్టోబర్‌లో గూగుల్‌కు రూ.1,337 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే అనైతిక, వ్యాపార పద్దతులను మార్చుకోవాలని..తన ప్రవర్తనను మార్చుకోవాలని ఎన్‌సీఎల్‌టీ హితవు పలికింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ ఇటీవల రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాల సీఐఐ ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ (CCI) హితవు కూడా పలికింది.