New Delhi, March 30: ప్రముఖ ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్‌కు (Google) మరోసారి గట్టి షాక్ తగిలింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఏకో సిస్టమ్ కేసునకు సంబంధించి సీసీఐ విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ ట్రిబ్యునల్‌ను (NCLAT) ఆశ్రయించిన గూగుల్‌కు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు సభ్యులు కలిగిన ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం..ఈ జరిమానా మొత్తాన్ని వచ్చే 30 రోజుల్లో జమచేయాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో గూగుల్‌కు రూ.1,337 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే అనైతిక, వ్యాపార పద్దతులను మార్చుకోవాలని..తన ప్రవర్తనను మార్చుకోవాలని ఎన్‌సీఎల్‌టీ హితవు పలికింది. దీనిపై స్పందించడానికి గూగుల్ వర్గాలు నిరాకరించారు.
National Company Law Appellate Tribunal (#NCLAT) said that #Google will have to pay the fine of Rs 1,337.76 crore, imposed on it by the Competition Commission of India (#CCI). pic.twitter.com/rNnMCBdROC
— IANS (@ians_india) March 29, 2023
ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ ఇటీవల రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాల సీఐఐ ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ (CCI) హితవు కూడా పలికింది. స్మార్ట్ ఫోన్ పని చేయాలంటే దానికి ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్) కావాలి. అలాంటి ఓఎస్ లలో ఆండ్రాయిడ్ ఒకటి. దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నాయి.
ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ప్లేస్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, య్యూటూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగుందని సీసీఐ పేర్కొంది. ఇక వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్దతులను గూగుల్ అవలంభిస్తోందని పేర్కొంటూ గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ అందించే ఫ్రీ ఇన్ స్టాల్ యాప్స్ ను డిలీట్ చేయకుండా నిరోధించడం వంటివి చేయకూడదు అంటూ పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.