గూగుల్‌పే యూజర్లు ఇక నుంచి సిబిల్ స్కోరు ఉచితంగా జీపేలో చెక్ చేసుకోవచ్చు. గూగుల్‌పే కూడా సిబిల్ స్కోరును ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. సిబిల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోరును తయారు చేస్తుంది. సిబిల్ స్కోర్ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా, 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు.
గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’ అనే ప్రశ్న కనిపిస్తుంది.
దాని కింద కనిపించే మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ‘Let’s check’ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్‌పై ఉన్న విధంగా పేరు నమోదు చేసి కంటిన్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయగానే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది