Google Removes Matrimonial Apps: ‘సర్వీస్ ఫీజు చెల్లింపు’ల్లో వివాదం.. ప్లేస్టోర్ నుంచి భారత్ మ్యాట్రిమోనీ, జాబ్ సెర్చింగ్ యాప్ లను తొలగించిన గూగుల్
ప్లేస్టోర్ నుంచి భారత్ కు చెందిన మ్యాట్రిమోనీ, జాబ్ సెర్చింగ్ యాప్ లను తొలగించడం మొదలుపెట్టింది.
Hyderabad, Mar 2: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్ (Playstore) నుంచి భారత్ కు చెందిన మ్యాట్రిమోనీ, జాబ్ సెర్చింగ్ యాప్ లను తొలగించడం మొదలుపెట్టింది. ‘భారత్ మ్యాట్రిమోనీ’ (Bharat Matrimony) వంటి పాపులర్ యాప్ సహా మొత్తం 10 కంపెనీల యాప్ లను గూగుల్ తొలగించనుంది. సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదం కారణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్ధారిత సర్వీసు ఫీజులు చెల్లించలేమంటూ మ్యాట్రీమోనీ యాప్ ల నిర్వహకులు గూగుల్ కు తేల్చి చెప్పడం, ఇదే సమయంలో.. 15-30 శాతం ఫీజులు విధించే పాత విధానాన్ని రద్దు చేయాలంటూ కొద్దికాలం క్రితం అధికారులు గూగుల్ కు ఆదేశించడం తాజా చర్యకు కారణమైనట్టు సమాచారం.
తొలగించిన ప్రాధాన యాప్ లు ఇవిగో..
భారత్ మ్యాట్రిమోనీ, క్రీస్టియన్ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రీమోనీ, జోడీ యాప్ లను గూగుల్ శుక్రవారం తొలగించింది.