Telangana e-Pass Apply Online: తెలంగాణ లాక్‌డౌన్, ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోమంటున్న పోలీసు శాఖ, పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ అంజనీ కుమార్
లాక్‌డౌన్‌లో (Lockdown)అత్యవసర సేవలు సేవల కోసం పోలీసులు ఈ-పాస్ (Telangana e-Pass)జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (HYD CP Anjani Kumar) తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది. అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్ లభిస్తుందని సీపీ చెప్పారు.
Hyderabad, April 20: లాక్‌డౌన్‌లో (Lockdown)అత్యవసర సేవలు సేవల కోసం పోలీసులు ఈ-పాస్ (Telangana e-Pass)జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (HYD CP Anjani Kumar) తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది. అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్ లభిస్తుందని సీపీ చెప్పారు. ఇళ్లలోనే పండుగలు, ప్రార్థనలు, మే 7 వరకు ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు
పోలీసు వెబ్‌సైట్ నుంచి ఈ–పాస్
నగర పోలీసు విభాగ అధికారిక వెబ్‌సైట్ కు ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభమైంది. ఇకనుంచి ఎవరూ పోలీసు కమిషనరేట్, ఇతర కార్యాలయాకు రాకుండానే వీటిని పొందవచ్చు. అత్యవసర, కీలక, నిత్యావసర సర్వీసులు అందిస్తున్న వ్యక్తులు, వాహనాలు, కార్యాలయాలకు చెందినవారికి మాత్రమే ఈ–పాస్‌లు జారీ చేస్తామని కొత్వాల్ అంజనీకుమార్ ప్రకటించారు.
Check Here E-PASS Apply Video
ముందుగా www.hyderabadpolice.gov.in లో లాగిన్ అవ్వాలి. అందులో ఈ -పాస్ లింక్‌ను ఓపెన్ చేసి.. అత్యవసర సేవల వివరాలు, అనుమతికి కారణాలు, వ్యక్తి ఫొటో, ధ్రువీకరణ పత్రం (ఆధార్, వాహనం ఆర్సీ) అప్‌లోడ్ చేయాలి. అక్కడ పాస్ కోరుతున్న వారి గుర్తింపు కార్డు, ఫొటో అప్‌లోడ్ చేసి, ఫోన్ నంబరు, ఇతర వివరాలు పొందుపరచాలి. ఈ మొత్తం ప్రక్రియ పది నిమిషాల్లోపే పూర్తవుతుంది.
Here's IPS Anjani Kumar Tweet
వీటిని పరిశీలించిన తర్వాత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ–పాస్ జారీ చేస్తూ పొందుపరిచిన ఫోన్ నంబర్‌కు సందేశం పంపుతారు. ఇందులో ఉన్న లింకు ఆధారంగా సదరు వ్యక్తులు ఈ–పాస్ డౌన్‌లోడ్ చేసుకుని, కలర్ ప్రింట్ ఔట్ తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులకు కూడా ఈ–పాస్ పైన ఉండే క్యూఆర్ కోడ్‌ను రీడ్ చేసే పరికరాలు అందిస్తున్నారు.
.నీలోఫర్ ఆసుపత్రిలో 45 రోజుల పసిబిడ్డకు సోకిన కరోనావైరస్
ఈ–పాస్‌లను వీటితో స్కాన్ చేసిన వెంటనే పూర్తి వివరాలు వారికి తెలుస్తాయి. ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. ఈ -పాస్‌తో పాటు గుర్తింపు కార్డును కూడా వెంటబెట్టుకోవాలని సూచించారు. ఈ–పాస్‌లను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
54 జిల్లాల పరిధిలో పూర్తిగా తగ్గిన కరోనా కేసులు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణలో మే 7 వరకూ లాక్‌డౌన్ కొనసాగింపు నేపథ్యంలో పాసుల దుర్వినియోగంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాసుల రివ్యూ చేయడానికి ప్రత్యేకంగా ఓ పోలీస్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఒకవేళ పాసులు దుర్వినియోగం అవుతున్నట్లు తేలితే వాటిని క్యాన్సిల్ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ విస్తృతం అవుతున్నందున ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)