Instagram

New Delhi, JAN 21: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఇటీవల తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదే.. క్వైట్ మోడ్ (Quiet Mode) అని పిలిచే ఈ ఫీచర్ ద్వారా స్నేహితులు, ఫాలోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయడంతో పాటు డైరెక్ట్ మెసేజ్‌లకు (DMలు) ఆటోమాటిక్‌గా రిప్లే ఇవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా లేరని ఫాలోవర్లను హెచ్చరించేందుకు అకౌంట్ స్టేటస్ ‘ఇన్ క్వైట్ మోడ్’కి సెట్ చేసుకోవచ్చు. టీనేజ్ యూజర్లు వారి స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించేందుకు కొత్త ఫీచర్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

‘టీనేజ్ పిల్లలు కొన్నిసార్లు కొంత సమయం తీసుకోవాలని భావిస్తుంటారు. రాత్రిపూట, చదువుతున్నప్పుడు, స్కూల్ సమయంలో తమ ఏకాగ్రతను నిలిపేందుకు అనేక మార్గాల కోసం చూస్తుంటారు. మీ షెడ్యూల్‌కు సరిపోయేలా మీ మ్యూట్ మోడ్ గంటలను సులభంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆఫ్ చేసిన తర్వాత.. మీకు నోటిఫికేషన్‌ల ద్వారా అలర్ట్ పొందవచ్చు. తద్వారా మీరు మిస్ అయిన వాటిని తెలుసుకోవచ్చు. మీ అకౌంట్ ‘క్వైట్ మోడ్‌లో’ సెట్ చేయాలనుకుంటే.. కొత్త ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో క్వైట్ మోడ్‌ని ఎనేబుల్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Korn Ferry Survey: జాబ్స్ కోతల్లో టెకీలకు గుడ్ న్యూస్, ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు, కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వేలో వెల్లడైన నిజాలు  

* మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ని ఓపెన్ చేయండి.

* మీ ప్రొఫైల్ ఐకాన్‌పై Tap చేయండి.

* ఆ తర్వాత, మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న 3 బార్‌లపై Tap చేయండి.

* సెట్టింగ్‌లను ఎంచుకుని, నోటిఫికేషన్‌లపై Tap చేయండి.

* క్వైట్ మోడ్‌ని ఎనేబుల్ చేసేందుకు నోటిఫికేషన్‌లపై Tap చేయండి. ఆపై టోగుల్‌ని On చేయండి.

మరో వార్తలో Instagram ఈ ఏడాదిలో ఫిబ్రవరి నుంచి మెయిన్ బార్ నుంచి షాపింగ్ ట్యాబ్‌ను తొలగించాలని ప్రకటించింది. కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసే బటన్ కిందికి మూవ్ అవుతుంది. అయితే రీల్స్ ట్యాబ్ కుడి వైపుకు వస్తుంది. ఈ మార్పులతో యూజర్లను స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు యాప్‌పై ఆసక్తిని షేర్ చేయడానికి సులభతరం చేస్తాయని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.



సంబంధిత వార్తలు

Allu Arjun Promises David Warner: డేవిడ్ వార్న‌ర్ కు అల్లు అర్జున్ ప్రామిస్, పుష్ప స్టెప్ నేర్పిస్తానంటూ పోస్ట్, వైర‌ల్ గా మారిన కామెంట్

Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణలో 5 మంది కాంగ్రెస్ నేతలు అరెస్ట్

Telangana Elections 2024: మూడు ప్రధాన పార్టీలకు షాకిచ్చిన బర్రెలక్క, నాగర్ కర్నూల్ నుంచి లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ, నామినేషన్ వేసిన కర్నె శిరీష

Kalki 2898 AD: అమితాబ్ ఇంత యంగ్ గా మారిపోయాడేంటి? క‌ల్కిలో బిగ్ బీ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్, షాక్ అవుతున్న ఫ్యాన్స్

Amit Shah Slams Congress: తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త

Nayanthara Unfollows Husband: భర్తకు విడాకులివ్వనున్న నయనతార? ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేసిన నయనతార, కొంతకాలంగా వినిపిస్తున్న పుకార్లకు మరింత బలం

Urvashi Rautela Turns 30: బర్త్ డే కోసం ఏకంగా రూ.3 కోట్లతో కేక్, 24 క్యారెట్ బంగారంతో తయారు చేసిన కేక్ కట్ చేసిన బాలీవుడ్ నటి (వీడియో ఇదుగోండి)