Layoffs in 2023: నియామకాలు తగ్గినప్పటికీ, 50 శాతం మంది దేశీయ ఉద్యోగులు జాబ్ మారడానికి సిద్ధంగా లేరు
దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను పెద్దమొత్తంలో తీసివేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా భారత్ లో 47 శాతం మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థను మారడానికి సిద్ధంగా లేరని జాబ్ పోర్టల్ ఇండీడ్ సర్వేలో తేలింది.
New Delhi, April 18: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం భయాలు కొనసాగుతున్నాయి. దిగ్గజ సంస్థలు (Global Companies) సైతం ఉద్యోగులను (Employees) పెద్దమొత్తంలో తీసివేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా భారత్ లో 47 శాతం మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థను మారడానికి సిద్ధంగా లేరని జాబ్ పోర్టల్ (Job Portal) ఇండీడ్ సర్వే (Indeed Survey) లో తేలింది. జనవరి-మార్చి త్రైమాసికంలో నియామకాలు 53 శాతం మాత్రమే ఉన్నాయని, అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికంలో నమోదైన 64 శాతం తో పోలిస్తే ఇది తక్కువేనని వెల్లడించింది. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు, యజమానులు అప్రమత్తతతో ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్ సెక్టార్లలో గ్రోత్ బాగుండొచ్చు’ అని ఇండీడ్ హెడ్ ఆఫ్ సేల్స్ శశి కుమార్ అన్నారు.
గడిచిన త్రైమాసికంలో జాబ్ గ్రోత్ రేట్ ఇలా..
- బీఎఫ్ఎస్ఐ-71 శాతం
- హెల్త్ కేర్-64 శాతం
- రియల్ ఎస్టేట్-57 శాతం
- మీడియా, వినోదం-49 శాతం
- ఐటీ, ఐటీఈఎస్-29 శాతం
- మ్యానుఫ్యాక్చరింగ్-39 శాతం