Microsoft Plan to Buy TikTok: టిక్‌టాక్‌పై మైక్రోసాఫ్ట్ కన్ను, అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు పావులు, ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం
సెప్టెంబరు 15, 2020 నాటికి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో (ByteDance) ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది.
Washington D.C, August 3: చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు సంబంధించిన అమెరికా హక్కులు సొంతం (Microsoft Plan to Buy TikTok) చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ధ్రువీకరించింది. సెప్టెంబరు 15, 2020 నాటికి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో (ByteDance) ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది. పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్ బ్యాన్, 275 యాప్‌లపై నిషేధం దిశగా అడుగులు
ఈ మేరకు సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ కంపెనీ తన బ్లాగ్‌లో కీలక విషయాలను వెల్లడించింది. టిక్‌టాక్ (TikTok) అమెరికా విభాగాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ పంపిన ప్రతిపాదనలకు బైట్‌డ్యాన్స్ సానుకూలంగా స్పందించిందని, ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు అందులో పేర్కొంది
యూఎస్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో సైతం టిక్‌టాక్ నిర్వహణ బాధ్యతలు సొంతం చేసుకునే యోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించి ఇతర అమెరికా పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని కూడా తాము ఆహ్వానించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఒప్పందం వల్ల టిక్‌టాక్ అమెరికా యూజర్లకు ఎలాంటి భంగం వాటిల్లబోదని, ఎవరితోనూ తాము ఈ సమాచారం పంచుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే ఈ యాప్‌లో యూజర్ల వ్యక్తిగత డేటా ఇతర దేశాలకు చేరి ఉంటే అన్ని సర్వర్ల నుంచి దానిని డిలీట్ చేయిస్తామని హామీ ఇచ్చింది.
చైనాతో వాణిజ్య, దౌత్యపరమైన విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ డ్రాగన్ కంపెనీలపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టిక్‌టాక్‌పై సహా వివిధ చైనీస్ యాప్‌లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో టిక్‌టాక్ హక్కులను అమెరికా కంపెనీ(మైక్రోసాఫ్ట్) కొనుగోలు చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని ఇది వరకే స్పష్టం చేశారు.
టిక్‌టాక్‌కు ఇప్పటికే అమెరికాలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్.ఎల్‌వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టీసీ) ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్ డాలర్ల మేరు జరిమానా విధించింది. అదే విధంగా 2019 ఫిబ్రవరిలో ఎఫ్‌టీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్ డిక్రీ) టిక్‌టాక్ ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేశాయి. అంతేగాక తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్ అమెరికన్ మ్యూజిక్ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి.