Cell Phone Addiction: స్మార్ట్‌ఫోన్‌కు బానిసై..తల్లిదండ్రులను గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్న యువకుడు, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
అయితే ఇది చాలా మేలు చేసినా కొన్ని సార్లు నష్టాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ యువకుడు స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్ (Cell Phone Addiction) అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి (The boy forgot his everything) చేరుకున్నాడు.
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. అయితే ఇది చాలా మేలు చేసినా కొన్ని సార్లు నష్టాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ యువకుడు స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్ (Cell Phone Addiction) అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి (The boy forgot his everything) చేరుకున్నాడు.
రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సహ్వా టౌన్‌కు చెందిన అక్రామ్ (20) స్మార్ట్ ఫోన్ మోజులోపడి గతనెల రోజుల్లో చేస్తున్న బిజినెస్‌ను వదిలేశాడు. అంతేకాకుండా గత ఐదురోజులుగా నిద్రకూడా పోవట్లేదట. పరిస్థతి విషమించడంతో కుటుంబసభ్యులు భార్టియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వర్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రస్టులు వైద్యం అందిస్తున్నారు.అతనికి వరుసకు మామైన అర్బాజ్ మాట్లాడుతూ ‘మా ఊరిలోనే అక్రమ్‌కు ఎలక్ట్రిక్ వైడింగ్ వ్యాపారం ఉంది. ఐతే గత నెల రోజులుగా అధిక సమయం మొబైల్‌తోనే గడుపుతున్నాడు. ఫోన్ చూడటంలోపడి చేస్తున్న పని కూడా మానేశాడు. కుటుంబసభ్యులు పదేపదే చెప్పినా మొబైల్‌ని చూడటం మాత్రం మానలేదని తెలిపాడు.
కొన్ని రోజులుగా రాత్రంతా మొబైల్‌లో చాట్‌లు, గేమ్‌లు ఆడుతున్నాడు. తినడం, త్రాగటం కూడా మానేశాడని తల్లి ఆవేదనతో స్థానిక మీడియాకు తెల్పింది. భార్టియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రస్టులు అతడికి వైద్యం అందిస్తున్నారు.ఈ విషయమై మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. యువకుడికి సిటీ స్కాన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. స్మార్ట్‌ఫోన్ కు బానిసలైతే గతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.