Mobile Users Alert: మీ ఫేస్‌బుక్‌ డేటా చెక్ చేసుకోండి, కార్టూనిఫైయర్ యాప్‌ ద్వారా Facebookలోకి దూరిన హ్యకర్లు, పాస్‌వర్డ్స్‌ను దొంగిలిస్తున్నారంటున్న నిపుణులు

ఏకంగా గూగుల్‌ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను (Fake Apps) చొప్పించి..సదరు యాప్స్‌ ద్వారా మాల్వేర్స్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్‌ యాప్‌ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫేస్‌బుక్‌ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది.

Google Play Store (Photo Credits: IANS)

ఈ మధ్య హాకర్స్ రెచ్చపోతున్నారు. ఏకంగా గూగుల్‌ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను (Fake Apps) చొప్పించి..సదరు యాప్స్‌ ద్వారా మాల్వేర్స్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి ఎక్కిస్తున్నారు. ఇలాంటిదే తాజాగా కార్టూనిఫైయర్‌ యాప్‌ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫేస్‌బుక్‌ డేటాను దొంగిలిస్తోన్నట్లు తెలుస్తోంది. కార్టూనిఫైయర్ యాప్‌లో FaceStealer అనే మాల్వేర్‌ను గుర్తించారు. కార్టూనిఫైయర్‌ యాప్‌(cartoonifier app)తో హ్యకర్లు ఆయా యూజర్ల ఫేస్‌బుక్‌ ఖాతాల పాస్‌వర్డ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు ప్రడియో(Pradeo) వెల్లడించింది.

ఇప్పటికే ఈ యాప్‌ను సుమారు లక్షకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లు ఇన్‌స్టాల్‌ చేసినట్లు ప్రడియో తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ యాప్‌పై గూగుల్‌ ప్రతినిధులు స్పందించారు. 'క్రాఫ్ట్‌సార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్' పేరుతో ఉన్న యాప్ ఇకపై డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదని, ప్లే స్టోర్‌ నుంచి తొలగించమని గూగుల్‌ ప్రతినిధి ప్రముఖ టెక్‌ బ్లాగింగ్‌ సంస్థ బ్లీపింగ్‌ కంప్యూటర్‌కు తెలియజేశారు.

ఆరు సెకండ్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు హ్యాకింగ్, సంచలన నివేదికను బయటపెట్టిన నార్డ్‌వీపీఎన్‌ సంస్థ, హెచ్చరికలు జారీ చేసిన ఆర్బీఐ

ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలని సూచించారు. అంతేకాకుండా గూగుల్‌ ప్లే స్టోర్‌లో సదరు యాప్స్‌ను చెక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిందంటూ సూచించారు.