Hacking Alert: ఆరు సెకండ్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు హ్యాకింగ్, సంచలన నివేదికను బయటపెట్టిన నార్డ్‌వీపీఎన్‌ సంస్థ, హెచ్చరికలు జారీ చేసిన ఆర్బీఐ
state-bank-of-india-offers-emi-facility-on-its-debits-cards (Photo-File image)

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వాడకం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అయితే అదే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా ఎక్కువయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తూ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను కొట్టేసి, డబ్బులను (Your credit, debit card can be hacked) లాగేసుకుంటున్నారు. వీరి నుంచి దూరంగా ఉండేందుకుగాను క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలను ఇతరులతో పంచుకోవద్దంటూ బ్యాంకులు కూడా హెచ్చరిస్తుంటాయి. ఇక క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును ( credit, debit card)హ్యాక్ చేయడానికి కేవలం ఆరు సెకన్ల సమయం సరిపోతుందంటూ ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ గ్లోబల్‌ వీపీఎన్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ నార్డ్‌వీపీఎన్‌ అనే సంస్థ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల హ్యకింగ్‌పై ఒక నివేదికను రిలీజ్‌ చేసింది. 140 దేశాల నుంచి 40 లక్షల కార్డు పేమెంట్లను పరిశీలిస్తే.. బ్రూట్ ఫోర్స్ ద్వారా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను ఎక్కువగా హ్యాక్ చేస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి మోసాలు చాలా వేగంగా జరుగుతాయని, కేవలం సెకన్ల వ్యవధిలోనే సదరు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్ల నుంచి డబ్బులను ఇట్టే స్వాహా చేస్తోన్నట్లు పేర్కొంది.

పెద్ద సంఖ్యలో కార్డు పేమెంట్స్ వివరాలు డార్క్ వెబ్‌లో కనిపించడానికి ముఖ్య కారణం బ్రూట్ ఫోర్స్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు సదరు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల నెంబర్లను, సీవీవీను అంచనా వేస్తున్నారని నార్డ్‌వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరిజూస్ బ్రిడీస్ తెలిపారు. హ్యకింగ్‌లో భాగంగా.. తొలి 6 - 8 డిజిట్స్ అనేవి కార్డు ఇష్యూయర్ ఐడీ నెంబర్‌ను సూచిస్తుండగా...ఇక మిగతా 7 - 9 నెంబర్లను హ్యాకర్లు గెస్ చేస్తే సరిపోతుందని తెలిపారు.దీంతో హ్యకర్లు సులువుగా కార్డులను హ్యక్‌ చేస్తున్నట్లు తెలిపారు.

అనిల్ అంబానీ కీలక నిర్ణయం, రెండు గ్రూప్‌ సంస్థల డైరెక్టర్‌ పదవులకు రాజీనామా, సెబీ ఆదేశాలమేరకు తప్పుకున్న దిగ్గజ వ్యాపారవేత్త

మనం వాడే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 16 అంకెల యూనిక్‌ నెంబర్‌ ఉంటుంది. కార్డుల నెంబర్లను గేస్‌ చేయడానికి అనేక కాంబినేషన్లను ప్రత్యేకమైన కంప్యూటర్‌ సహాయంతో సైబర్‌ నేరస్తులు హ్యక్‌ చేస్తోన్నట్లు బ్రీడిస్‌ అభిప్రాయపడ్డారు. గంటకు 25 బిలియన్ కాంబినేషన్‌లను ప్రయత్నించవచ్చని తెలిపారు. డెబిట్‌ , క్రెడిట్‌ కార్డులను సులువుగా హ్యక్‌ చేయడానికి వారికి కేవలం 6 సెకన్ల సమయం సరిపోతుందని వెల్లడించారు.

ఇక క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు ఆర్బీఐ ఎప్పటికప్పుడూ హెచ్చరికలను జారీ చేస్తోంది. పలు సూచనలు ( how you can protect yourself) పాటించడంతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల హ్యకింగ్‌ నుంచి దూరంగా ఉండవచ్చును. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్లు ఎప్పటికప్పుడు వారి నెలవారీ స్టేట్‌మెంట్‌లను సమీక్షించడం మంచింది. మీ బ్యాంక్ నుంచి వచ్చే ప్రతి భద్రతా నోటిఫికేషన్‌కు త్వరగా స్పందించాలి.తక్కువ మొత్తంలో డబ్బును ఖాతాలో ఉంచుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌. వివిధ ప్రయోజనాల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం మంచింది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు సదరు బ్యాంకులు అందించే తాత్కాలిక వర్చువల్ కార్డులతో లావాదేవీలను జరపడం ఉత్తమం. టెలిఫోన్‌లు/ఈ-మెయిల్స్‌ ద్వారా వచ్చే మోసపూరిత ప్రకటనలను అసలు నమ్మకూడదు.