 
                                                                 New Delhi, Mar 25: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) తాజాగా రెండు గ్రూప్ సంస్థల నుంచి వైదొలగారు. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా (Resigns as Director of RPower, RInfra) చేశారు. సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా రిలయన్స్ పవర్ బోర్డు నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ అంబానీ వైదొలిగారు’’ అని రిలయన్స్ పవర్ బిఎస్ఇ ఫైలింగ్‌లో తెలిపింది.
కాగా ఏ లిస్టెడ్ కంపెనీలోనూ అనిల్ పదవులు నిర్వహించకుండా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ డి.అంబానీ బోర్డు నుంచి వైదొలగినట్లు రిలయన్స్ పవర్ తాజాగా బీఎస్‌ఈకి వెల్లడించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. కంపెనీ నుంచి నిధులను అక్రమంగా తరలించిన ఆరోపణలతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌తోపాటు.. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ ఈ ఫిబ్రవరిలో నిషేధించింది.
అంతేకాకుండా ఈ నలుగురినీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలు, లిస్టెడ్ కంపెనీలు, పబ్లిక్ నుంచి నిధులు సమీకరించే కంపెనీలు తదితరాలలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా సెబీ నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేసింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
