ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీలో టెస్లా కార్లకు సంబంధించిన గిగా ఫ్యాక్టరీని 2022 మార్చి 22న ఎలన్‌ మస్క్‌ ప్రారంభించాడు. ఈ సందర్భంగా టెస్లా గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తైయిన మోడల్‌ వై కారు పక్కన నిల్చుని ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ (Elon Musk Dance Video) చేశారు. ఒక్కసారిగా ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ చూసిన అక్కడి వారు కేరింతలు, చప్పట్లతో మరింత ఉత్సాహాపరిచారు. ఎలన్‌ మస్క్‌ మూవ్‌మెంట్స్‌ను క్యాచ్‌ చేసేందుకు వచ్చిన డ్రోన్‌ కెమెరాను చూసి మస్క్‌ మరింతగా రెచ్చిపోయారు. డ్రోన్‌ ముందుకెళ్లి మరీ చిందులాడారు. ఎలన్‌ మస్క్‌ డ్యాన్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది డ్యాన్స్‌ వీడియో క్లిప్స్‌లను షేర్‌ చేస్తున్నారు. మరికొందరు షాంగై గిగా ఫ్యాక్టరీ డ్యా‍న్స్‌ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. రెండింటిలో ఏదీ బాగుందో చెప్పాలంటూ కోరుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)