MP Vivek Venkataswamy Resigns to BJP: పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. వెంటనే తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.కాగా బీజేపీ తరఫున పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి వివేక్ పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రాజీనామా ప్రకటించి కాంగ్రెస్‌లో చేరిపోయారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 లో వివేక్ పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) లో చేరారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరోమారు బీఆర్ఎస్ లో చేరిన వివేక్.. ఈ రోజు వరకు బీజేపీలో కొనసాగారు. తాజాగా, ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.
వీడియో ఇదిగో, కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి
కాగా కొడుకుకు రాజకీయ వారసత్వాన్ని అందించే పనిలొ భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొడుకు గడ్డం వంశీ 22 ఏళ్లకే విశాఖ ఇండస్ట్రీస్‌లో చేరి జేఎండీ బాధ్యతలు చేపట్టాడు. కంపెనీకి సంబంధించిన ఆవిష్కరణలలో భాగం కావడంతో పాటు సొంత యూట్యూబ్ ఛానెల్‌తో పలువురు ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు సైతం చేశాడు.మణిపూర్ అల్లర్ల సమయంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వంశీ పెట్టిన పోస్టులు(ఆ తర్వాత డిలీట్ చేశాడు) పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.