తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి తోడుగా రావాలని కోరినట్లు పేర్కొన్నారు. విష్ణురెడ్డి భవిష్యత్తుపై తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. నాగం జనార్ధన్ రెడ్డి నేను అనేక పోరాటాలు చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేశాలని పిలుపునిచ్చారు. ఈసారి పాలమూరులో 14కు 14సీట్లు గెలవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని సీఎం తెలిపారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారన్న కేసీఆర్.. మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ది చెప్పాలని అన్నారు.
Here's Video
కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త జైపాల్ రెడ్డి, కరీంనగర్ పట్టణానికి చెందిన కొందరు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. pic.twitter.com/YsvuYnougg
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)