Smartphone User Alert: మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని ప్రదేశాలు, ఈ ప్రాంతాల్లో మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు
ఎక్కడికి వెళ్లినా మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అది లేకుండా పూట గడవలేని పరిస్థితి. అయితే చాలామంది ఫోన్ వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని (Smartphone User Alert) నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అది లేకుండా పూట గడవలేని పరిస్థితి. అయితే చాలామంది ఫోన్ వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని (Smartphone User Alert) నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల ఫోన్ పెట్టుకుంటే (Never Put Your Phone in These Places) ఆరోగ్యంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు చాలామంది ఎక్కువగా ఫోన్లను రాత్రి పూట వాడుతారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా వాడటం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
ప్యాంట్ బ్యాక్ పాకెట్‌లో సెల్‌ఫోన్‌ని పెట్టుకోకూడదట. బ్యాక్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఫోన్ ఒత్తిడికి గురై బ్యాటరీ ఉబ్బే ప్రమాదముందని చెప్తున్నారు. ఆ బ్యాటరీ ఉబ్బితే ఆ ఫోన్ పేలే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు ఉన్న దగ్గరలో సెల్‌ఫోన్లు ఉంచకూడదట. ‘0' డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్‌లో సెల్‌ఫోన్ ఉంచడం వల్ల ఆ ఫోన్లో ఉన్న బ్యాటరీ సామర్ధ్యాన్ని కోల్పోతుందని పరిశోధకులు చెప్తున్నారు.
సెల్‌ఫోన్‌ని ఎండలో పెట్టి మర్చిపోవడం లాంటివి చెయ్యకూడదట. అలా ఎండలో పెట్టి మర్చిపోవడం వల్ల బ్యాటరీ వేడెక్కి అందులో ఉన్న ద్రవం బయటకొచ్చి ఫోన్ పాడైపోయే అవకాశాలుంటాయి.కొంతమంది వంట చేస్తూ ఫోన్ మాట్లాడతారట. అలాంటి సమయంలో ప్రెజర్ కుక్కర్, స్టవ్‌కి దగ్గరలో ఫోన్‌ని ఉంచుతూ ఉంటారు. ఇది అన్నింటికంటే చాలా ప్రమాదమని పరిశోధకులు చాలా గట్టిగా చెప్తున్నారు.
నిద్ర పోయే సమయంలో మొబైల్ దగ్గర పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల నిద్ర చేడిపోయే ప్రమాదంతో పాటు ఫోన్ పేలితే గాయాలవడం ఖాయం. చాలామంది నిద్రలో ఫోన్ పేలి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్నానం చేసే సమయంలో బాత్ రూంకి సెల్ తీసుకెళ్లొద్దు. ఒకవేళ తీసుకెళితే అది నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంది.
ఫోన్ లో ఎక్కువగా బ్లూ లైట్ కనిపిస్తుంది. ఈ బ్లూ లైట్ వల్ల కంటికి ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ ఈ బ్లూ లైట్ భారీన పడుతుందని వారంటున్నారు. ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా విడుదల అవుతుంది. సాయంత్రానికి అది పూర్తి స్థాయిగా అవతరించే సమయంలో బ్లూ లైట్ మెలటోనిన్ విడుదలను పూర్తిగా తగ్గిస్తుందని తద్వారా నిద్రలేమి సమస్యలు వస్తాయని వారంటున్నారు.
రాత్రి సమయంలో ఫోన్ వాడకండి..ఒక వేళ వాడితే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలని చెబుతున్నారు.నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు కూడా సూచిస్తున్నారు.