డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్ గూగుల్ ప్లేస్టోర్‌లో 19,300 సురక్షితం కాని యాప్‌లను (Avast found in more than 19 thousand dangerous apps) గుర్తించింది. డేటాబేస్(ఫైర్‌బేస్ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్ హెచ్చరించింది. కాగా యాప్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌ను ( Google Play Store) సురక్షితమైన సోర్స్‌గా భావిస్తుంటారు. కానీ, ఇందులో ఉన్న యాప్స్ కూడా యూజర్ డాటాకు ముప్పు తెచ్చేవే అని తర్వాతి కాలంలో వెలుగు చూసింది.
ప్రస్తుతం గుర్తించిన యాప్‌ల వివరాల్ని గూగుల్‌కు అందజేశామని, తద్వారా యాప్ డెవలపర్స్ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నామని ఎవాస్ట్ తెలిపింది. సాధారణంగా డెవలపర్స్ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్(మొబైల్-వెబ్ యాప్స్) డెవలపింగ్ కోసం ఫైర్‌బేస్‌ను ఉపయోగిస్తారు . ఆ మొత్తాన్ని ఇతర డెవలపర్స్‌కు కనిపించేలా ఉంచుతారు. ఈ క్రమంలో ఈ డేటాబేస్ ద్వారా ఆ సమాచారం మొత్తం అందరికీ చేరుతుంది.
వీటిలోని యాప్స్ మిస్‌కన్‌ఫిగరేషన్ ప్రభావం వల్ల.. లైఫ్‌స్టైల్, వర్కవుట్, గేమింగ్, మెయిల్స్, ఫుడ్ డెలివరీ ఇతరత్ర యాప్‌ల నుంచి డేటా లీక్ కావొచ్చు. అంటే యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్ డేటా, ఒక్కోసారి పాస్‌వర్డ్‌లు కూడా హ్యాకర్ల చేతికి అందుతాయి.మొత్తంగా లక్షా ఎనభై వేల మూడు వందల యాప్స్‌ను ఎవాస్ట్ థ్రెట్ ల్యాబ్ రీసెర్చర్స్ పరిశీలించారు. అందులో 10 శాతం అంటే.. 19,300 యాప్స్ ఓపెన్‌గా, గుర్తింపులేని డెవలపర్స్ నుంచి డాటాను లీక్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెరిఫై మార్క్ లేని యాప్స్ లేని డౌన్‌లోడ్ చేయవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తన్నారు.