JioPhone Next (Photo Credits: Reliance Jio)

New Delhi, September 11: ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో నెక్ట్స్‌ (JioPhone Next) లాంచింగ్ తేదీ వాయిదా పడింది. రిలయన్స్‌ వార్షిక సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్‌ చేస్తామని ఆ కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ పేర్కొన్నారు. సెర్చింజ‌న్ గూగుల్‌తో క‌లిసి అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్‌ను డెవ‌ల‌ప్‌చేశామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ ఆ ఫోన్‌ను దీపావ‌ళి క‌ల్లా విప‌ణిలోకి (JioPhone Next Roll-Out Before Diwali 2021) తీసుకొస్తామ‌ని రిల‌య‌న్స్ జియో శుక్ర‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత ప్ర‌క‌టించింది.

ప‌రిమితంగా కొంద‌రు యూజ‌ర్ల‌తో జియో నెక్ట్స్ ఫోన్ టెస్టింగ్ జియో-గూగుల్ మొద‌లు పెట్టాయి. వారి నుంచి వ‌చ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫోన్‌లో మ‌రికొన్ని ఫీచ‌ర్లు తీసుకొస్తాం. దీపావళి క‌ల్లా ఈ ఫోన్‌ను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంచ‌డానికి య‌త్నిస్తున్నాం. అప్పటికైనా ఇప్పుడు వెంటాడుతున్న‌ సెమీకండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం’ అని రెండు కంపెనీలు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేశాయి.మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను జ‌త క‌లిపేందుకు జాప్యం అవుతుంద‌ని జియో చెబుతున్నా.. సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌తే (Global Chip Shortages) దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

జియో నుంచి కొత్తగా 3 నెలల ప్లాన్లు, రూ.2,097 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి

అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు అందించే ఫోన్‌గా జియో నెక్ట్స్‌ గురించి ప్రచారం జరిగింది. టెక్‌ దిగ్గజం గూగుల్‌, ఇంటర్నెట్‌ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో సంస్థల భాగస్వామ్యంలో వస్తోన్న తొలి ఫోన్‌గా దీనికి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. గూగుల్‌ అందిస్తోన్న అనేక అధునాత ఫీచర్లను జియో నెక్ట్స్‌ ఫోన్‌లో పొందు పరిచారు. ఇప్పటికే ఈ ఫోన్‌ పనితీరురు పరిశీలిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో చిప్‌సెట్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో సెప్టెంబరు 10 మార్కెట్‌లోకి తేవడం కంటే కొంత సమయం తీసుకుని దీపావళికి రిలీజ్‌ చేయడం బెటర్‌ అని రెండు కంపెనీలు భావించాయి. దీంతో లాంఛింగ్‌కి ఒక రోజు ముందే వాయిదా నిర్ణయాన్ని ప్రకటించాయి.

వాట్సాప్ షాక్, 3 మిలియన్లకు పైగా భారతీయుల ఖాతాలు బ్యాన్, జూన్ 16 నుండి 31 జూలై 2021 మధ్య కాలంలో ఈ సంఘటన జరిగిందని తెలిపిన మెసేజింగ్ దిగ్జజం

జులైలో రిలయన్స్‌ వార్షిక సమావేశం జరిగినప్పటి నుంచి నెక్ట్స్‌ ఫోన్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనీసం పది కోట్ల మందికి నెక్ట్స్‌ ఫోన్‌ను అందివ్వడం తమ లక్క్ష్యమని ముఖేశ్‌ అంబాని ప్రకటించారు. అందుకు తగ్గట్టే కేవలం రూ.500 చెల్లిస్తే చాలు మిగిలిన సొమ్ము ఈఎంఐలో చెల్లించండి అంటూ అనేక ఆర్థిక సంస్థలు ఫైనాన్స్‌ చేసేందుకు రెడీ అయ్యాయి. చౌక‌ధ‌ర‌లో 4జీ క‌నెక్టివిటీ స్మార్ట్ ఫోన్ కావాల‌నుకునే వారి కోసం జియోఫోన్ నెక్ట్స్ రూపొందిస్తున్న‌ట్లు గ‌తంలోనే జియో వెల్ల‌డించింది. రిల‌య‌న్స్ జియో కోసం ప్ర‌త్యేకంగా గూగుల్ డెవ‌ల‌ప్ చేసిన ఆప్టిమైజ్డ్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది.

ఇవీ జియోఫోన్ నెక్ట్స్ ఫీచ‌ర్లు

పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్ అయిన జియో ఫోన్ నెక్ట్స్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌, ఆటోమెటిక్‌ రీడ్‌-అలౌడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్స్ట్‌, లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌, రియాల్టీ ఫిల్టర్స్‌, స్మార్ట్‌ కెమెరా త‌దిత‌ర ఫీచ‌ర్లు జ‌త క‌లుస్తాయి. ఇంకా ఈ ఫోన్ ధ‌రను నిర్ణ‌యించ‌లేదు. ప్ర‌పంచంలోకెల్లా అతి త‌క్కువ ధ‌ర ఉంటుంద‌ని ముకేశ్ అంబానీ ఇంత‌కుముందే చెప్పారు.