PhonePe New Feature: ఫోన్‌ పేలోకి కొత్త ఫీచర్, ఇకపై లావాదేవీలు మరింత సులువు, ఛాట్ చేస్తూనే డబ్బులు సెండ్ చేసుకోవచ్చు

తమ ప్లాట్ ఫాంపై డిజిటల్ చెల్లింపులు జరిపే యూజర్ల కోసం ఫోన్‌పే ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ ఇతర మెసేజింగ్ యాప్ (Messaging App) అవసరం లేకుండానే పేమెంట్ ధ్రువీకరించవచ్చు.

PhonePe introduces chat feature on iOS, Android (Photo Credits: IANS)

New Delhi, Febuary 4: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌ పే (PhonePe) తమ వినియోగదారుల కోసం కొత్త చాట్ ఫీచర్ (Chat Feature) ప్రవేశపెట్టింది. తమ ప్లాట్ ఫాంపై డిజిటల్ చెల్లింపులు జరిపే యూజర్ల కోసం ఫోన్‌పే ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ ఇతర మెసేజింగ్ యాప్ (Messaging App) అవసరం లేకుండానే పేమెంట్ ధ్రువీకరించవచ్చు. ఐబీఎం సీఈఓగా మనోడే

తన ప్లాట్‌ఫాంలో లావాదేవీలను మరింత సులువుగా జరుపుకునేలా వినియోగదారులకు (PhonePe users) చాట్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలలో చాట్‌ ఫీచర్‌ను (New Chat Feature) ప్రారంభించింది.

ఉచితంగా వైఫై కాలింగ్‌ సేవలు

ఈ ఫీచర్ ద్వారా, యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసేజింగ్ అనువర్తనం అవసరం లేకుండా డబ్బును అడగడం లేదా ధృవీకరణ కోసం చెల్లింపు రసీదును కూడా సెండ్‌ చేసుకోవచ్చు. ఒకవైపు చాటింగ్ చేస్తూనే అదే బాక్సులో ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చని ఫోన్ పే సీటీఓ, సహా వ్యవస్థాపకుడు రాహుల్ చారీ (Rahul Chari, Co-Founder and CTO, PhonePe) ఒక ప్రకటనలో తెలిపారు.

జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది

ఈ చాట్‌కు సంబంధించిన చాట్‌ హిస్టరీ (Chat History) కూడా ‘చాట్‌ ఫ్లో’ లో డిస్‌ ప్లే అవుతుంది. దీంతో ఆ తరువాత లావాదేవీ కూడా సులభతరం అవుతుంది. తమ చాట్‌ ఫీచర్‌ తమ కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన అనుభవంగా మారుతుందని ఫోన్‌పే అని సహ వ్యవస్థాపకుడు తెలిపారు.

రూపాయికే 1జీబి డేటా, జియోకి సవాల్ విసురుతున్న బెంగుళూరు వైఫై డబ్బా స్టార్టప్ కంపెనీ

రాబోయే వారాల్లో ఫోన్‌పే చాట్‌ను గ్రూప్ చాట్ ఫీచర్‌తో మరింత మెరుగుపరుస్తామని చారి తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.కంపెనీ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే యూజర్లు 185 మిలియన్లకు పైగా ఉన్నారు.

ఫోన్‌ పే యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి?

ఫోన్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేసి కాంటా‍క్ట్‌ లిస్ట్‌ నుంచి సంబంధిత కాంటాక్ట్‌ నెంబరును ఎంచుకోవాలి. ఇక్కడ మీకు రెండు ఆప్లన్లు కనిపిస్తాయి. 1. చాట్‌ 2. సెండ్‌. చాటింగ్‌ కోసం చాట్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత నగదు పంపడానికి సెండ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకొని, నగదును పంపొచ్చు.