Free Jio Wi-Fi calling starts rolling out, works with over 150 phones and all Wi-Fi networks (Photo-PTI)

Mumbai, January 10: టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు వైఫై కాలింగ్‌ పేరిట (Free Jio Wi-Fi calling)మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జియో వినియోగదారులు (Jio Users) ఏ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయి ఉన్నా సరే ఆ వైఫై ద్వారా వాయిస్‌, వీడియో కాల్స్‌ (Voice, Video Calls) చేసుకోవచ్చు. జియో యూజర్ల కోసం ప్రత్యేకించి ఈ ఫీచర్ ఉచితంగా అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. జియో వైఫై కాలింగ్ సర్వీసు జనవరి 7 నుంచి ప్రారంభమైందని, జనవరి 16 నాటికి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

150 హ్యాండ్ సెట్లకు ఈ ఫీచర్ సపోర్ట్ ఇస్తోంది. దీని ద్వారా అన్ని వైఫై నెట్ వర్క్ ల ద్వారా ఈజీగా జియో యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా వై-ఫై కనెక్టవిటీ ఉంటేనే ఈ Wi-Fi కాలింగ్ ఫీచర్ వర్క్ అవుతుందని ఎయిర్ టెల్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ మాదిరిగా జియో వైఫై కాలింగ్ కూడా ఉచితంగానే యూజర్లు పొందవచ్చు. సాధారణంగా వై-ఫై నెట్ వర్క్ కు కనెక్ట్ అయిన ఫోన్లలోనే వైఫై కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఫోన్ యాప్ ద్వారా చేసిన కాల్ అయినా సరే వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు వాడే ఫోన్ వై-ఫై నెట్ వర్క్ కనెక్ట్ కాకుంటే.. రెగ్యులర్ GSM నెట్ వర్క్ లేదా VoLTE నెట్ వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఇండియాలోని యూజర్లకు వైఫై కాలింగ్ ఫీచర్ ద్వారా కాల్ చేస్తే పూర్తిగా ఉచితమని జియో వెల్లడించింది. ISD కాల్స్, ఇంటర్నెషనల్ కాలింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవాలంటే ముందుగా యూజర్లు VoLTE లేదా Wi-Fi నెట్ వర్క్ యాక్సస్ చేసుకోవాల్సి ఉంటుందని జియో పేర్కొంది. వై-ఫై కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా యూజర్లు తమ ఫోన్లలోని సెట్టింగ్స్ లో Wi-Fi calling ఫీచర్ Enable చేయాల్సి ఉంటుందని జియో తెలిపింది.

జియో వైఫై కాలింగ్‌ను సపోర్ట్‌ చేసే ఫోన్లు

1. ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ 7, 7 ప్లస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 8, 8 ప్లస్‌, ఐఫోన్‌ X, ఐఫోన్‌ XS, ఐఫోన్‌ XS మ్యాక్స్‌, ఐఫోన్‌ XR, ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రొ, ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌

2. గూగుల్‌ పిక్సల్‌ 3, పిక్సల్‌ 3ఎ, 3ఎ ఎక్స్‌ఎల్‌

3. కూల్‌ ప్యాడ్‌ కూల్‌ ప్లే 6, మెగా 5, మెగా 5సి

4. ఇన్ఫినిక్స్‌ హాట్‌ 7 ప్రొ, స్మార్ట్‌ 3 ప్లస్‌, హాట్‌ 6 ప్రొ, ఇన్ఫిన్సి ఎస్‌4

5. లావా జడ్‌61, జడ్‌92, జడ్‌60ఎస్‌, జడ్‌81

6. మొబిస్టార్‌ సి1, సి1 షైన్‌, సి2, ఎక్స్‌1 సెల్ఫీ, ఎక్స్‌1 నాచ్‌

7. టెక్నో కామన్‌ ఐ4, ఐ స్కై, ఐ ట్విన్‌

8. వివో వి11, వి11 ప్రొ, వి15, వి15 ప్రొ, వి9, వి9 ప్రొ, వై81, వై81ఐ, వై91, వై91ఐ, వై93, వై95, వై15, వై17, వై91, జడ్‌1 ప్రొ

9. షియోమీ రెడ్‌మీ కె20, కె20 ప్రొ, పోకో ఎఫ్‌1

10. ఇంటెల్‌ ఎస్‌42, మోటోరోలా మోటో జి6

పైన తెలిపిన స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా పలు శాంసంగ్‌ ఫోన్లు, ఇతర ఫోన్లలోనూ జియో వైఫై కాలింగ్‌ సేవలను వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. ఇక ఈ సేవలకు సపోర్ట్‌ చేసే మరిన్ని ఫోన్ల వివరాలను తెలుసుకోవాలంటే జియో వెబ్‌సైట్‌ను కస్టమర్లు సందర్శించవచ్చు.