Realme Narzo 70 Turbo 5G: రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ మార్కెట్లోకి వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది

Realme Narzo 70 Turbo 5G

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ (Realme) నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ ప్రాసెసర్ తో వస్తోంది. మూడు ర్యామ్ – మూడు స్టోరేజీ వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 6.67 అంగుళాల శాంసంగ్ ఈ4 ఓలెడ్ స్క్రీన్ విత్ జీటీ మోడ్ తో వస్తున్నది. ప్రధాన గేమ్ టైటిళ్ల కోసం 90ఎఫ్పీఎస్ ఆఫర్ చేస్తోంది.

మోటరోలా రేజర్ 50 వచ్చేసింది, ఫ్లిప్ సైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇవిగో..

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ (Realme Narzo 70 Turbo 5G) ఫోన్‌ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు లభిస్తుంది. టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. రియల్‌మీ ఇండియా వెబ్ సైట్, అమెజాన్ ద్వారా ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ పోన్ కొనుగోలుదారులకు రూ.2000 స్పెషల్ కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ.

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 వర్షన్

120 హెర్ట్జ్ రీప్రెష్ రేటు,

180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్,

2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్

6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) శాంసంగ్ ఈ4 ఓలెడ్ స్క్రీన్

రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్

26 జీబీ వరకూ ర్యామ్

50-మెగా పిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ రేర్ కెమెరా,

2-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా,

16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా

5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్,

గ్లోనాస్, బైదూ, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్,

యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై కనెక్టివిటీ

యాక్సెలరేసన్ సెన్సర్, ఫ్లిక్సర్ సెన్సర్,

గైరో మీటర్, లైట్ సెన్సర్,

మ్యాగ్నటిక్ ఇండక్షన్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్,

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్,

డ్యుయల్ స్టీరియో స్పీకర్లు