Redmi 14c 5G: లో బడ్జెట్‌లో మరో 5G ఫోన్ లాంచ్ చేస్తున్న రెడ్‌మీ, జనవరి 7న మార్కెట్లోకి రానున్న Redmi 14c 5G మొబైల్

2025 జనవరి ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. రెడ్‌మీ 14 ఆర్ 5జీ ఫోన్‌ను పోలి ఉండే రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌‌లో లార్జ్, సెంటర్డ్ సర్క్యులర్ రేర్ కమెరా మాడ్యూల్ ఉంటుంది.

Redmi 14C 5G (Photo Credits: Official Website)

New Delhi, DEC 28: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2025 జనవరి ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. రెడ్‌మీ 14 ఆర్ 5జీ ఫోన్‌ను పోలి ఉండే రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌‌లో లార్జ్, సెంటర్డ్ సర్క్యులర్ రేర్ కమెరా మాడ్యూల్ ఉంటుంది. ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటాయి. రెడ్‌మీ కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లో ఈ ఫోన్ లభ్యం అవుతుంది. రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు.

Lava Yuva 2 5G: లావా నుంచి మ‌రో బ‌డ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్, కేవ‌లం రూ.9500కే ఎన్నో ఫీచ‌ర్స్ తో ఫోన్ రిలీజ్ 

సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. 6.88 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది. 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ రూ.12 వేల లోపు ధరకే లభిస్తుందని భావిస్తున్నారు. ఇంకా రెడ్‌మీ తన రెడ్‌మీ 14సీ 5జీ ఫోన్ ధర వివరాలు వెల్లడించలేదు.