Honda NX200

Mumbai, FEB 14: దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్‌లతో ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్‌ఎక్స్‌ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్‌ఎక్స్‌ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్‌. ఈ కొత్త చేరికతో హోండా భారత్‌లో విక్రయించే ఎన్‌ఎక్స్‌ శ్రేణి బైక్‌లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్‌లో ఎన్‌ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్‌లో ఎన్‌ఎక్స్‌కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్‌ను ఎన్‌ఎక్స్‌200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.

Hyundai Venue: హ్యుందాయ్ నుంచి సరికొత్త కంపాక్ట్‌ ఎస్‌యూవీ, టాప్‌ కంపెనీలకు పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి.. 

స్టైలింగ్ పరంగా ఎన్‌ఎక్స్‌200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్‌సైకిల్‌పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌, బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌తో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ప్రధానంగా ఉన్నాయి.

Honda Activa 2025: హోండా యాక్టీవా 2025 మోడల్‌ వచ్చేసింది! కేవలం రూ. 80వేలకే అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చిన కంపెనీ 

ఎన్‌ఎక్స్‌200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్‌తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ బైక్‌లో జత చేశారు. హోండా ఎన్‌ఎక్స్‌200ను కంపెనీ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.