Jio Independence Offer: ఏడాది పొడవునా ప్రతి రోజు 2.5 జీబీ డేటా ఉచితం, జియో నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్, పూర్తి వివరాలు ఇవే..
రూ.2,999 రీచార్జ్ చేసుకునే వారికి అంతే విలువైన ఇతర ప్రయోజనాలను (Benefits worth Rs 3,000) అందిస్తోంది.
రిలయన్స్ జియో యూజర్ల కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ ను (Jio Independence Offer) ప్రకటించింది. రూ.2,999 రీచార్జ్ చేసుకునే వారికి అంతే విలువైన ఇతర ప్రయోజనాలను (Benefits worth Rs 3,000) అందిస్తోంది. రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ కాల వ్యవధి ఏడాది. ప్రతి రోజు 2.5 జీబీ డేటాను ఏడాది పొడవునా ఉచితంగా పొందొచ్చు. అంతేకాదు 75 జీబీ ఉచిత డేటా అదనంగా లభిస్తుంది. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి అదిరిపోయే న్యూస్, అక్టోబర్ నుంచి 5జీ సేవలు అందుబాటులోకి, ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందామని తెలిపిన రిల్
ఈ ప్లాన్ తీసుకున్న వారికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. విడిగా ఈ ప్లాన్ తీసుకోవాలంటే రూ.499 అవుతుంది. వీటికి అదనంగా రూ.750 విలువైన అజియో కూపన్, నెట్ మెడ్స్, ఇక్సిగో డిస్కౌంట్ ఆఫర్లు కూడా లభిస్తాయి. రూ.2,879 వార్షిక ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే రోజువారీగా 2జీబీ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ కూడా అపరిమితంగా చేసుకోవచ్చు. ఇందులో డిస్నీ హాట్ స్టార్ ప్రయోజనం ఉండదు. రూ.2,545 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. రోజువారీ 1.5జీబీ డేటా ఉచితం. వాయిస్ కాల్స్ కూడా ఉచితం. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమే