Jio Cheapest Plan: జియో మరో సంచలనం. రూపాయికే నెలంతా డేటా ప్యాక్, 30 రోజుల వాలిడిటీ ఉచితం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకోండి
టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్‌ను యూజర్ల కోసం రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను (Jio Cheapest Plan) ప్రవేశపెట్టింది.
టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్‌ను యూజర్ల కోసం రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను (Jio Cheapest Plan) ప్రవేశపెట్టింది.సరికొత్త ప్రీపేడ్ రీచార్జ్ ప్లాన్ రూపాయిని ప్రవేశపెట్టిన జియో (Reliance Jio) ఈ ప్లాన్ ద్వారా రూపాయితో జియో నెంబర్‌కు రీచార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వాలిడిటీని ఉచితంగా అందిస్తారు. అలాగే.. 100 ఎంబీ హైస్పీడ్ డేటాను అందిస్తారు. 100 ఎంబీ డేటా పూర్తయ్యాక.. 30 రోజుల వరకు 64 కేబీపీఎస్ స్పీడ్‌తో డేటాను ఉచితంగా అందిస్తారు.
రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ (Cheapest Prepaid Recharge Plan) ద్వారా రీచార్జ్ చేసుకోవాలనుకుంటే.. మైజియో యాప్‌కు వెళ్లి.. రీచార్జ్ సెక్షన్‌లో వాల్యు అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. అధర్ ప్లాన్స్‌లో రూపాయి ప్లాన్ ఆప్షన్ ఉంటుంది. అందులో బూయ్ BUY అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రూపాయితో రీచార్జ్ చేసుకోవచ్చు. ఇక డాటా డౌన్‌లోడ్‌లో రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. గత నెలకుగాను సెకన్‌కు 24.1 మెగాబైట్స్ డాటా డౌన్‌లోడ్‌తో అగ్రస్థానంలో కొనసాగిందని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. సరాసరి ఈ రెండు సంస్థల కంటే జియో వేగం పది శాతం అధికమని పేర్కొంది.
మరోవైపు, డాటా అప్‌లోడ్‌లో మాత్రం వొడాఫోన్ ఐడియా టాప్ స్థానంలో కొనసాగుతున్నది. గడిచిన ఐదు నెలలుగా ఇదే స్థానంలో ఉండటం విశేషం. సెకన్‌కు 8 మెగాబైట్స్ డాటా అప్‌లోడ్ అయింది. అలాగే జియో 7.1 మెగాబైట్స్, ఎయిర్‌టెల్ 5.6 మెగాబైట్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.