Reliance-Future Group Deal: రిలయన్స్ రూ.24,713 కోట్ల డీల్, ప్యూచర్ గ్రూప్ వ్యాపారాలను సొంతం చేసుకున్న రిల్, ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు కొత్త వ్యూహం
తాజాగా రిలయన్స్ కిషోర్ బియానీ (Kishor Biyani) ప్రమోట్ చేస్తున్న ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు (Reliance-Future Group Deal) చేసినట్లు శనివారం రిలయన్స్ ప్రకటించింది. ప్యూచర్ గ్రూప్‌కు (Future Group) చెందిన వేర్‌హౌస్, హోల్‌సేల్, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది.
New Delhi, Auguat 30: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యూహలతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రపంచ వ్యాప్త దిగ్గజ కంపెనీగా దానిని తీసుకువెళుతున్నాడు. తాజాగా రిలయన్స్ కిషోర్ బియానీ (Kishor Biyani) ప్రమోట్ చేస్తున్న ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు (Reliance-Future Group Deal) చేసినట్లు శనివారం రిలయన్స్ ప్రకటించింది. ప్యూచర్ గ్రూప్‌కు (Future Group) చెందిన వేర్‌హౌస్, హోల్‌సేల్, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. అయితే ప్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేయడానికి డీల్ విలువ రూ.24,713 కోట్లు కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఫ్యూచర్ గ్రూప్ విభాగాలైన ఫాషన్ లైఫ్ స్టైల్ తదితర బ్రాండ్స్ రిలయెన్స్ రిటైల్ వెంచర్‌లోకి రానున్నాయి.
ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం లభించింది.రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు. రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి
ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్‌కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్‌వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు