TRAI New Rules: సిమ్ కార్డ్ రీప్లేస్ మెంట్, సిమ్ స్వాప్ కోసం పది రోజులు వేచిచూడక్కర్లేదు.... రేపటి నుంచి అమల్లోకి ట్రాయ్ కొత్త రూల్స్
సిమ్ స్వాప్, రీప్లేస్ మెంట్ కు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Newdelhi, June 30: సిమ్ స్వాప్ (SIM Swap), రీప్లేస్ మెంట్ కు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) (TRAI) మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మొబైల్ నెంబర్ సిమ్ స్వాప్ లేదా రీప్లేస్ మెంట్ కోసం గతంలో ఉన్న పది రోజులు గడువును ఏడు రోజులకు తగ్గించినట్లు ట్రాయ్ వివరించింది. వినియోగదారుల సౌకర్యార్ధం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సిమ్ స్వాప్, రీప్లేస్‌మెంట్ మోసాలను అరికట్టడంతో పాటు, యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఏమిటీ సిమ్ కార్డ్ రీప్లేస్ మెంట్?
ప్రస్తుత సబ్ స్ర్కైబర్ తాను పోగొట్టుకున్న లేదా పని చేయని సిమ్ కార్డుకు బదులుగా కొత్త సిమ్ కార్డును తీసుకునే ప్రక్రియను సిమ్ స్వాప్ లేదా రీప్లేస్ మెంట్ అంటారు.
టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...