Aditya-L1 Mission: ఇస్రో లేటెస్ట్ వీడియో ఇదిగో, ఒకే ఫ్రేమ్‌లో భూమి,చంద్రుడు, అద్భుతమైన ఫొటోలను భూమి మీదకు పంపిన ఆదిత్య ఎల్1 మిషన్

ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్‌1.

Aditya-L1 Spacecraft Takes Selfie (Photo-X)

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) తన పనిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్‌1.

అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. తాజా ప్రయాణంలో ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది.

భూమికి దూరంగా చిన్న చుక్కలాగా చంద్రమామ, ఆదిత్య ఎల్1 పంపిన లేటెస్ట్ విజువల్స్ ఇవిగో..

‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది. ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్‌ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్‌1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో.

ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి శోధించనున్నాయి.



సంబంధిత వార్తలు