Tall- Cancer Link: మీరు పొడగ్గా ఉంటారా..? అయితే మీకు క్యాన్సర్‌ ముప్పు పొంచిఉన్నట్లే.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే..!

పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని నమ్ముతారు.

tall person (Credits: X)

Newdelhi, Sep 3: పొడుగ్గా (Height) ఉండాలని, అలా ఉంటే మిగతా వారితో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తామని అందరూ అనుకుంటారు. పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని నమ్ముతారు. అయితే పొడవుగా ఉండటం కూడా మన ఆరోగ్యంపాలిట (Health Risk) శాపంగా మారుతుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఎత్తు ఎక్కువ ఉన్నవారికి క్యాన్సర్‌ ముప్పు అధికమని ‘యూకే మిలియన్‌ విమెన్‌ స్టడీ’ తేల్చింది. తాము అధ్యయనం చేసిన 17 మంది పొడుగు వ్యక్తులలో 15 మంది క్యాన్సర్‌ బాధితులేనని తెలిపింది. పొట్టి వారితో పోలిస్తే పొడవుగా ఉన్న వారు త్వరగా క్యాన్సర్‌ బారినపడతారని అధ్యయనం పేర్కొన్నది.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ కు మ‌రో కీల‌క బాధ్య‌త‌లు?! చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో రాష్ట్ర సర్కారు

ఎత్తుకు క్యాన్సర్‌ కు సంబంధం ఏమిటి?

ఎత్తు ఎక్కువగా ఉన్న వారిలో కణాలు పెద్ద సంఖ్య లో ఉంటాయి. క్యాన్సర్‌ ముప్పుకు ఇది కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఏయే క్యాన్సర్లు రావొచ్చు?

పొడుగు వ్యక్తులు స్కిన్‌ (మెలానోమా), బ్రెస్ట్‌ (మెనోపాజ్‌ ముందు, వెనక), పెద్దపేగు, యుటెరస్‌ (ఎండోమెట్రియం), పాంక్రియాస్‌, ఓవరీ, ప్రొస్టేట్‌, కిడ్నీ వంటి క్యాన్సర్ల బారినపడే అవకాశం ఉన్నదని వరల్డ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ ఫండ్‌ తెలిపింది.

ముప్పు ఇలా..

మనం పెరిగే ప్రతి 10 సెంటీమీటర్ల ఎత్తుకు క్యాన్సర్‌ వచ్చే ముప్పు 16 శాతం ఎక్కువగా ఉంటుందని క్యాన్సర్‌ రిసెర్చ్‌ ఫండ్‌  వివరించింది.