ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య
సోమనాథ్ స్పందించారు.
Newdelhi, Sep 29: చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.
ఖగోళాన్ని మరింత లోతుగా
ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్ రే పోలారిమీటర్ శాటిలైట్ పై (ఎక్స్ పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్ పోశాట్ తో పాటూ ఇన్‌శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.