SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.
Newdelhi, Aug 16: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో (ISRO) ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 (SSLV-D3) ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహక నౌక 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం కొనసాగింది. ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉపయోగం ఏమిటి?
విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈవోఎస్-08 ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఈ శాటిలైట్ పర్యవేక్షణ పెట్టనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.