Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!
ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
Newdelhi, Aug 12: డయాబెటిక్ (Diabetes) రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని (Electric Bandage) నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. డయాబెటిస్ రోగులకే కాకుండా సాధారణ వ్యక్తులకు కూడా అయ్యే తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్ లు నయం చేయగలవని వాళ్లు చెప్తునారు. సాధారణ బ్యాండేజ్ లతో పోల్చితే 30% వేగంగా గాయాల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.
మేము విడిపోవడం కన్నా చనిపోవడమే మేలు, బీహార్‌లో లవర్స్ హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఎలా పనిచేస్తుందంటే?
గాయమైన ప్రాంతంలో ఈ బ్యాండేజ్ ని అతికించాలి. అలా అతికించాక.. దానిపై ఒక నీటి బిందువు వెయ్యాలి. దీంతో బ్యాండేజ్ లోని బ్యాటరీ యాక్టివేట్ అవుతుంది. అనంతరం గాయం చుట్టూ విద్యుత్తు క్షేత్రం ఏర్పడి.. కొన్ని గంటల్లోనే గాయం తగ్గడానికి ఛాన్స్ ఏర్పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.