App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు..

కృత్రిమ మేథ సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.

London, September 6: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణకు యాంటీజెన్, పీసీఆర్ వంటి పరీక్షలు ఉన్నాయి. అయితే, పేద దేశాలకు ఈ పరీక్షలను భరించే స్తోమత ఉండకపోవచ్చు. ఈ క్రమంలో కృత్రిమ మేథ (Artificial Intelligence) సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ (Smart Phone App)ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్‌ సోకిందో లేదో ఈ యాప్‌ చెప్పగలదు. కోవిడ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కంటే ఎక్కువ (89 శాతం ఖచ్చితత్వంతో) ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్‌ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్‌ చేసి చెక్‌ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు.

మెలికలు తిరిగిన ఆకాశహార్మ్యం.. చూడముచ్చట గొలిపే కలల సౌధం.. చైనాలో ప్రారంభం

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్‌ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌లో ఈ యాప్‌ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో ఈ యాప్‌ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌ లో (Research) పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. యాప్‌ టెస్ట్‌ లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్‌ (Screen) మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్‌ చేసిన యాప్‌ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది.