Newdelhi, Dec 16: భూమిలోపల భారీ ఎత్తున హైడ్రోజన్ (Hydrogen) నిక్షేపాలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది. ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్తును (Electricity) అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి కింది పొరల్లో దాదాపు 6.2 ట్రిలియన్ టన్నుల హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు ఈ అధ్యయనం పేర్కొన్నది. పెట్రోల్, డీజిల్ నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, ఇతర హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. దీనికి ‘హైడ్రోజన్’ చక్కటి ప్రత్యామ్నాయ ఇంధనం అవుతుందని సైంటిస్టుల నమ్మకం.
Trillions of tons of underground hydrogen could power Earth for over 1,000 years: Study. https://t.co/uavs0kXQn5
— Interesting Engineering (@IntEngineering) December 15, 2024
సహజ వాయువు కంటే మెరుగు
ప్రస్తుతం భూమిలో నుంచి వెలికి తీస్తున్న సహజ వాయువు ఇంధనం కన్నా ‘హైడ్రోజన్’ ఇంధనం ఎన్నో రెట్లు శక్తివంతమైనదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.