No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

New Delhi, DEC 14: పాఠశాలలో అడ్మిషన్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వరకూ ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వారు ప్రతి పదేండ్లకోసారి అప్‌డేట్ (Update) చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది అందుకు అనుగుణంగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసిపోతున్నది. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UADAI) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆధార్‌లో అడ్రస్‌లో (Aadhar Update) మార్పులు చేసుకోవాలంటే వెంటనే ఆన్ లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. పదేండ్లకోసారి ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడానికి ఆధారాలు గల పత్రాలు సబ్మిట్ చేయాలి.

UPI Achieves Historic Milestone: యూపీఐ పేమెంట్స్ లో భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర‌, ఏకంగా రూ. 223 లక్ష‌ల కోట్ల చెల్లింపులు 

అయితే ‘మై ఆధార్’ (My Aadhar) పోర్టల్ ద్వారా మాత్రమే ఉచితంగా లభిస్తాయి. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత గతంలో మాదిరిగానే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ కాగానే, అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకోవాలి. వాటిని సవరించాల్సి వస్తే సవరించాలి. వాటిని ధృవీకరించుకుని నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ పత్రాలు అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ రావడంతో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.