Toyota Urban Cruiser EV Is Maruti Suzuki E Vitara

Mumbai, DEC 14: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. బ్రిటన్ మార్కెట్లో తన అర్బన్ క్రూయిజర్ ఈవీ కారును (Toyota Urban Cruiser EV) ఆవిష్కరించింది. సుజుకి మోటార్స్ ఈ-విటారా బ్యాడ్జితో (E vitara) రూపుదిద్దుకున్నదీ అర్బన్ క్రూయిజర్ ఈవీ. ఈ ఏడాది ప్రారంభంలో సుజుకి ఈ-విటారా ఆవిష్కరించారు. టయోటా, మారుతి సుజుకిల నుంచి వస్తున్న రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు వచ్చేనెలలో భారత్ ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు. మారుతి సుజుకి, టయోటా మధ్య టెక్నాలజీ మార్పిడి ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే. సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకున్నదే టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ. గుజరాత్ లోని మారుతి సుజుకి ప్లాంట్ లో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ / సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara) తయారవుతాయి.

Toyota Urban Cruiser EV Is Maruti Suzuki E Vitara

 

తొలుత భారత్ మార్కెట్లో మారుతి సుజుకి తన ఈ-విటారా కారును ఆవిష్కరిస్తుంది. అటుపై టయోటా తన అర్బన్ క్రూయిజర్ ఈవీ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. అర్బన్ క్రూయిజర్ ఈవీ, ఈ-విటారా కార్లు – బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (BEV) డెడికెటేడ్ ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. హై ఓల్టేజ్ భాగాల నుంచి రక్షణ కల్పిస్తూ ఈ రెండు కార్లను నిర్మించారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ కారు స్లీక్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ , ఎల్ఇడీ టెయిల్ ల్యాంప్స్ తోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మస్క్యులర్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్లు, 18/19 అంగుళాల వీల్స్ ఉంటాయి. బ్లాక్ రూఫ్ తోపాటు డ్యుయల్ టోన్ ఆప్షన్లతో వస్తోంది టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ ఇంటిగ్రేటెడ్ 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, వైర్ లెస్ చార్జర్, జేబీఎల్ ప్రీమియం ఆటో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా అండ్ సన్ రూఫ్, ప్రీ కొల్లిషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అల్టర్, లేన్ కీప్ అసిస్ట్ తదితర అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. సింగిల్ చార్జింగ్ తో 500 కిమీ దూరం ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. దీని ధర సుమారు రూ.19 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నది.