తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ కలగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని తప్పులు చేయడం వల్ల అది మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అధికంగా ఆకలి వేయడం లేదా ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ తప్పులు చేయడం మంచిది కాదు.
భోజనం తీసుకోకపోవడం- కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వారికి ఆకలి అసలే అనిపించదు. ఏది కూడా తినాలనిపించదు. అటువంటి అప్పుడు వారు తినకుండా ఉంటారు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మీకు తినాలని అనిపించిన లేకపోయినా తప్పనిసరిగా మీ బిడ్డ కోసం కడుపులో ఉన్న బేబీ కోసం తప్పకుండా పోషకాలు అందడం కోసం కచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాహారాలు ఎక్కువగా తీసుకుంటే మీ బిడ్డకు తగినంత పోషకాలు అంది బిడ్డ పెరుగుదల మంచిగా ఉంటుంది.
Health Tips: ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ...
మందులు సొంతంగా వేసుకోవడం- గర్భధారణ సమయంలో కొంతమందిలో ఒళ్ళు నొప్పులు జీర్ణ సమస్యలు వంటివి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వామిటింగ్ సెన్సేషన్, కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అటువంటి అప్పుడు వారు తరచుగా టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ అది అంత మంచి పద్ధతి కాదు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ఇచ్చిన మందులను మాత్రమే వాడడం మంచిది. లేకపోతే ఇది బిడ్డ పెరుగుదలలో ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి వైద్యుని సలహా మేరకు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది.
శారీరక శ్రమ లేకపోవడం- గర్భధారణ తర్వాత మహిళలు చాలామంది ఏ పని చేయడానికి ఇష్టపడరు. అసలు శారీరక శ్రమ లేకుండా విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటారు. అయితే కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఊరటగా ఉంటుంది. అంతేకాకుండా శారీరక శ్రమ కోసం లేకపోయినట్లయితే బద్దకంగా నీరసంగా అనిపిస్తుంది. బరువు అధికంగా పెరుగుతారు. కాబట్టి కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చిన్న చిన్న శ్రమ ఉన్న పనులు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఇవి మానుకోండి- కొంతమంది మహిళల్లో కెఫిన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది గర్భధారణ సమయంలో అంత మంచిది కాదు. సిగరెట్లు ,ఆల్కహాల్ వంటివి కూడా బిడ్డకు ఎదుగుదలకు అంత మంచిది కాదు. కాబట్టి గర్భధారణ సమయంలో వీటికి దూరంగా ఉండాలి. లేకపోతే బిడ్డ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం పైన కూడా ఇది అనేక దుష్ఫలితాలను ఇస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి