Jio-Silver Lake Deal: జియో మరో భారీ డీల్, రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫాంపై సిల్వర్ లేక్ రూ. 5,656 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామం అన్న ముఖేష్ అంబానీ
ప్రఖ్యాత టెక్ కంపెనీ సిల్వర్ లేక్ (Silver Lake) రిలయన్స్ జియోలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఆ సంస్థ సుమారు రూ. 5,656 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. రిలయన్స్‌లో 1.15 శాతం షేర్లను సిల్వర్ లేక్ కొనుగోలు చేయనున్నది. ఇటీవలే ఫేస్‌బుక్ కూడా సుమారు 5.7 బిలియన్ల డాలర్లు పెట్టి జియోలో 9.99 వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Mumbai, May 4: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కు చెందిన రిలయన్స్ జియో మరో భారీ డీల్ సాదించింది. ప్రఖ్యాత టెక్ కంపెనీ సిల్వర్ లేక్ (Silver Lake) రిలయన్స్ జియోలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఆ సంస్థ సుమారు రూ. 5,656 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. రిలయన్స్‌లో 1.15 శాతం షేర్లను సిల్వర్ లేక్ కొనుగోలు చేయనున్నది. ఇటీవలే ఫేస్‌బుక్ కూడా సుమారు 5.7 బిలియన్ల డాలర్లు పెట్టి జియోలో 9.99 వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం
రిలయన్స్‌కు చెందిన జియో ( Reliance Jio) సుమారు 388 మిలియన్ల కస్టమర్లకు డిజిటల్ సేవలు అందిస్తున్నది. టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో సిల్వర్ లేక్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. అతి తక్కువ ధరలో దేశ ప్రజలకు జియో సేవలు అందిస్తున్నట్లు సిల్వర్ లేక్ సీఈవో ఎగన్ డర్బన్ తెలిపారు. ఈ ఒప్పందంలో మోర్గన్ స్టాన్లీ .. ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా నిలిచింది. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర సంబంధిత చట్ట అనుమతులను పొందాల్సి వుంది.
ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా రికార్డున్న సిల్వర్ లేక్ భాగస్వామ్యం సంతోషాన్నిఇస్తోందన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామమని పేర్కొన్నారు.మరోవైపు అత్యంతముఖ్యమైన సంస్థలలో ఒకటిగా జియోను అభివర్ణించిన సిల్వర్ లేక్ కో సీఈఓ ఎగాన్ డర్బన్ చాలా బలమైన, వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో నడుస్తున్న సంస్థతో భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు.