Coronavirus Scare In Bengaluru: ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్, బెంగుళూరులో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ఖాళీ, ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలడంతో అందర్నీ బయటకు పంపిన టెక్ గెయింట్

ఎక్క చూసినా జనం భయం భయంగా బతుకుతున్నారు. ఇక కంపెనీలో పనిచేసే వారయితే కరోనా కేసు తగలగానే ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెక్ గెయింట్ ఇన్ఫోసిస్ కూడా దీని భారీన చిక్కుకుంది. బెంగుళూరులో (Bengaluru) ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు (Infosys) చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.

Tech gaint Infosys Vacates Building In Bengaluru Over Coronavirus Scare

Bengaluru Mar 14: కరోనా (Coronavirus)దెబ్బకు దేశం కుదేలవుతోంది. ఎక్క చూసినా జనం భయం భయంగా బతుకుతున్నారు. ఇక కంపెనీలో పనిచేసే వారయితే కరోనా కేసు తగలగానే ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెక్ గెయింట్ ఇన్ఫోసిస్ కూడా దీని భారీన చిక్కుకుంది.

దేశంలో ఇప్పటికీ 83 కేసులు నమోదు, మహారాష్ట్రలో 19కి చేరిన కరోనా కేసులు

బెంగుళూరులో (Bengaluru) ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు (Infosys) చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు. ముంద‌స్తు చ‌ర్య‌గా ఐఐపీఎం బిల్డింగ్‌లో ఉన్న‌వారిని త‌ర‌లిస్తున్న‌ట్లు ఇన్ఫోసిస్ సంస్థ వెల్ల‌డించింది. క‌ర్నాట‌క‌లోని బెంగుళూరులో (Coronavirus Scare In Bengaluru) ఇన్ఫోసిస్‌కు భారీ క్యాంప‌స్ ఉన్న‌ది.

అక్క‌డ డ‌జ‌న్ల సంఖ్య‌లో బిల్డింగ్‌లు ఉన్నాయి. డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు, కార్పొరేట్ హౌజ్‌లు ఉన్నాయి. అయితే ఉద్యోగుల భ‌ద్ర‌తా దృష్ట్యా.. బిల్డింగ్‌ను శానిటైజ్ చేస్తున్న‌ట్లు డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ హెడ్ గురురాజ్ దేశ్‌పాండే తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా వ‌చ్చే దుష్ ప్ర‌చారాల‌కు దూరంగా ఉండాల‌న్నారు.

దిల్లీలో కరోనావైరస్ సెలవులు

ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది. దాదాపు లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ మొత్తం 139 దేశాలకు పాకింది. ఇటలీలో ఒక్కరోజే 189 మంది చనిపోయారు.

గురువారం కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాతి రోజే మహిళ చనిపోయింది. దీంతో భారత్‌లో కరోనా కేసులు 83కు చేరాయి. కేరళలో కరోనా సోకిన వ్యక్తులు ముగ్గురు డిశ్చార్జి కాగా, మరో ఏడుగురి పరిస్థితి చక్కబడిందని, వారిని కూడా ఇంటికి త్వరలోనే పంపేస్తామని వైద్యులు చెబుతున్నారు.