Tecno POP 9 5G: రూ. 10 వేలకే టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్‌ఫోన్, అక్టోబర్ ఏడో తేదీ నుంచి ఫస్ట్ సేల్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఎన్ఎఫ్‌సీ మద్దతుతో 48-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తోంది. రూ.499 టోకెన్ సొమ్ముతో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

Tecno POP 9 5G (Photo-X)

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం టెక్నో (Tecno) తన టెక్నో పాప్ 9 5జీ (Tecno Pop 9 5G) స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఎన్ఎఫ్‌సీ మద్దతుతో 48-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తోంది. రూ.499 టోకెన్ సొమ్ముతో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మిగతా బ్యాలెన్స్ ఫోన్ కొనుగోలు సమయంలో చెల్లించొచ్చు. అక్టోబర్ ఏడో తేదీ నుంచి ఫస్ట్ సేల్ మొదలవుతుంది. టెక్నో పాప్ 9 5జీ పోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభిస్తాయి.

BSNL New Recharge Plans: బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు ఆకర్షణీయమైన ప్లాన్లు, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్ల వివరాలు తెలుసుకోండి 

ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్ నైట్ షాడో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అన్ స్పెసిఫైడ్ ఎల్‌సీడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్, 48 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్582 రేర్ కెమెరా సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, డోల్బీ ఆట్మోస్ తోపాటు డ్యుయల్ స్పీకర్లు వంటి ఫీచర్లు ఉంటాయి. 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహఎచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.