123PAY: ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపవచ్చు, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఆర్‌బీఐ నుంచి 123పే, యూపీఐ 123 పే ఎలా వాడాలో గైడ్ మీ కోసం

ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు.

What is 123PAY and how you can use it

ఫోన్ నుంచి డ‌బ్బులు పంపించాలంటే అది కేవ‌లం స్మార్ట్ ఫోన్ లో ఉండే ప్రత్యేకమైన యాప్​ల ద్వారా మాత్రమే సాధ్యం. దానికి కూడా ఇంట‌ర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. కానీ, దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ల సంఖ్య కంటే ఫీచ‌ర్ ఫోన్ వాడే క‌స్ట‌మ‌ర్ల సంఖ్యే ఎక్కువ‌గా ఉంది. దాదాపు 40 కోట్ల మంది ఇండియ‌న్స్ ఇప్పటికీ ఫీచ‌ర్ ఫోన్ వాడుతున్నారు. అటువంటి వాళ్లు కూడా త‌మ ఫోన్ ద్వారా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే చాన్స్​ని తాజాగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ప్రారంభించారు. దానికి 123పే (123PAY) అనే పేరు పెట్టారు.

కేవలం మూడంచెల్లో నెట్ అవసరం లేకుండానే 123పే (123PAY Use) ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు బ్యాంకు లావాదేవీలను జరిపేందుకు వీలుంటుంది. ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు. ఒక్కటేంటి పేమెంట్లు, రీచార్జ్, ఫాస్టాగ్, ఇతర బిల్లులను చెల్లించవచ్చు. కాగా, ఫీచర్ ఫోన్ల నుంచి డిజిటల్ పేమెంట్ల గురించి తెలుసుకునేందుకు వీలుగా ఇప్పటికే ఆర్బీఐ digisathi.info వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది.

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా ప్లాన్, రూ.329కే 20 ఎంబీపీస్ స్పీడ్‌తో 1000జీబీ డేటా

దాంతో పాటు 14431 లేదా 1800 8913333 నెంబర్లకూ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. 123పే వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు అనుమతిస్తుంది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన 24x7 హెల్ప్‌లైన్‌ను కూడా మంగళవారం ప్రారంభించారు.

ఐవీఆర్ కాలింగ్ ద్వారా ఇలా చేయొచ్చు

మొదట 080–45163666 కు 123పేను అనుసంధానించిన ఫీచర్ ఫోన్ తో కాల్ చేయాలి.

ఆ తర్వాత భాషను ఎంచుకుని.. నగదును బదిలీ చేసేందుకు ఒకటిని నొక్కాలి.

యూపీఐతో అనుసంధానించిన బ్యాంక్ పేరును చెప్పాలి.

వివరాలను ధ్రువీకరించేందుకు 1 ప్రెస్ చేయాలి.

తర్వాత ఆ మొబైల్ నంబర్ ద్వారా డబ్బును పంపేందుకు మరోసారి 1 ప్రెస్ చేయాలి.

ఆ వెంటనే మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.

మొబైల్ నంబర్ ను ధ్రువీకరించాక.. పంపించాలనుకున్న మొత్తాన్ని టైప్ చేయాలి.

యూపీఐ పిన్ ను ఎంటర్ చేసి ఓకే చేసేస్తే సరి. డబ్బు ట్రాన్స్ ఫర్ అవుతుంది.