ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. ఈ బంపర్ బొనాంజా ప్లాన్ ప్రకారం... కేవలం రూ.329కే 1000జీబీ డేటా పొందవచ్చు. అదికూడా 20 ఎంబీపీస్ స్పీడ్ తో డేటా వాడుకోవచ్చు. నెల రోజుల్లోపలే 1000జీబీ డేటా అయిపోతే బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇది బీఎస్ఎన్ఎల్ ఫైబర్ లో బేసిక్ ప్లాన్. నెల రోజుల కాలపరిమితితో వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏ నెట్వర్క్ కు అయినా లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)