WhatsApp: వాట్సాప్ వార్నింగ్, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డేటా గల్లంతే, వెంటనే డిలీట్ చేయండి, నకిలీ యాప్‌లకు దూరంగా ఉండాలని తెలిపిన వాట్సప్ సీఈఓ
అదే సమయంలో ఫేక్ వాటిపై కొరడా ఝళిపిస్తోంది. తాజాగా నకిలీ వాట్సాప్ యాప్ (Fake WhatsApp App) ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోందని, యూజర్లు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈవో విల్ కాథ్‌కార్ట్ హెచ్చరించారు.
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే సమయంలో ఫేక్ వాటిపై కొరడా ఝళిపిస్తోంది. తాజాగా నకిలీ వాట్సాప్ యాప్ (Fake WhatsApp App) ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోందని, యూజర్లు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈవో విల్ కాథ్‌కార్ట్ హెచ్చరించారు. ఈ యాప్ వాడే యూజర్లు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని, ఈ తరహా నకిలీ యాప్‌లను ఫోన్ల నుంచి డెలీట్ చేయాలని (Don't download this app) ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.
వాట్సాప్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ చేసిన పరిశోధనలో.. వాట్సాప్ తరహాలోనే యూజర్లకు సేవలను అందిస్తున్న కొన్ని హానికరమైన యాప్‌లను కనుగొన్నారని చెప్పారు. హేమాడ్స్ డెవలపర్ నుంచి మార్కెట్‌లో విడుదలైన ‘హే వాట్సాప్’ వంటి యాప్‌లు ప్రమాదకరమని, ప్రజలు వాటిని డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని క్యాత్‌కార్ట్ సూచించారు. ‘‘కొన్ని ప్రత్యేకమైన ఫీచర్‌లను యాప్‌లో యాడ్ చేశామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే అలాంటి యాప్‌లు కేవలం యూజర్ల ఫోన్‌లలో ఉన్న వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. దాని ద్వారా యూజర్ల డేటా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.
ఈ కొత్త నకిలీ వెర్షన్ ప్లే స్టోర్‌లో కనిపించదు, అయితే అనధికారిక వెబసైట్ల నుంచి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ పేరుతో వస్తున్న హే వాట్సాప్ యాప్‌ను వాడితే ఇబ్బంది తప్పదు. దానికి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదని’’ విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.