Wipro Layoffs: 800 మంది ఫ్రెషర్లకు షాకిచ్చిన విప్రో, Internal Test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి

800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను పరీక్ష తర్వాత తొలగించారని (Wipro Sacks Freshers) వార్తలు వచ్చాయి.

Wipro (Photo Credit: PTI)

భారతదేశంలోని మొదటి ఐదు ఐటి కంపెనీలలో ఒకటైన విప్రో, internal test తర్వాత పేలవమైన పనితీరు సాకుతో వందలాది మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. 800 మంది ఫ్రెషర్ ఉద్యోగులను పరీక్ష తర్వాత తొలగించారని (Wipro Sacks Freshers) వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ 800 మంది కాదని అంతకంటే తక్కువ మందిని తొలగించినట్లుగా పేర్కొంది. పరీక్షలో పేలవమైన పనితీరు కనబరిచిన తరువాత కంపెనీని విడిచిపెట్టమని కోరిన ఫ్రెషర్‌ల సంఖ్యను (fresher employees) మాత్రం విప్రో వెల్లడించలేదు.

బిజినెస్ టుడే ప్రశ్నలకు కంపెనీ స్పందిస్తూ, “విప్రోలో, అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మేము మన కోసం సెట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ-లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన పని ప్రాంతంలో నిర్దిష్ట స్థాయి నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము.

ట్విట్టర్లో ఆగని ఉద్యోగాల కోత, మరో 50 మంది ఉద్యోగులపై వేటు వేయనున్న ఎలాన్ మస్క్, ఇప్పటికే 3400 మందిని ఇంటికి పంపించిన ట్విట్టర్

మూల్యాంకన ప్రక్రియలో సంస్థ వ్యాపార లక్ష్యాలు, మా క్లయింట్‌ల అవసరాలతో ఉద్యోగులను సమలేఖనం చేయడానికి అంచనాలు ఉంటాయి. ఈ క్రమబద్ధమైన, సమగ్రమైన పనితీరు మూల్యాంకన ప్రక్రియ మార్గదర్శకత్వం, పునఃశిక్షణ, కొన్ని సందర్భాల్లో కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగులను వేరు చేయడం వంటి చర్యల శ్రేణిని ప్రేరేపిస్తుందని తెలిపారు.

తొలగించబడిన ఉద్యోగులకు కంపెనీ పంపిన టెర్మినేషన్ లెటర్‌ను బిజినెస్ టుడే యాక్సెస్ చేసింది. ఉద్యోగులకు శిక్షణ కోసం కంపెనీ ఖర్చు చేసిన రూ.75,000 చెల్లించాల్సి ఉందని, అయితే కంపెనీ దానిని మాఫీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. మీరు చెల్లించాల్సిన శిక్షణ ఖర్చు రూ.75,000/- మాఫీ చేయబడుతుందని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము" అని రద్దు లేఖలో పేర్కొన్నారు. విప్రోలో పేలవమైన పనితీరు కారణంగా తొలగించబడిన ఒక ఫ్రెషర్ బిజినెస్ టుడేతో మాట్లాడుతూ, “నాకు జనవరి 2022లో ఆఫర్ లెటర్ వచ్చింది, కానీ నెలల ఆలస్యం తర్వాత వారు నన్ను ఆన్‌బోర్డ్ చేశారు. ఇప్పుడు పరీక్ష సాకుతో నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నారని అన్నారు.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్, ఒకేసారి జాబ్స్ కోల్పోనున్న 11వేల మంది ఎంప్లాయిస్, రెండు విభాగాల్లోనే భారీగా ఉద్యోగాల కోతలు, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊస్ట్

ఈ నెల ప్రారంభంలో, విప్రో తన Q3 FY23 ఫలితాలను నివేదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,969 కోట్లతో పోలిస్తే నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 2.8 శాతం పెరిగి రూ. 3,052.90 కోట్లుగా నమోదైంది.