Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్, ఒకేసారి జాబ్స్ కోల్పోనున్న 11వేల మంది ఎంప్లాయిస్, రెండు విభాగాల్లోనే భారీగా ఉద్యోగాల కోతలు, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊస్ట్
Microsoft Office (Photo Credits: Microsoft)

Washington, JAN 18: ఆర్ధిక మాంధ్యం భయాలు టెక్ కంపెనీలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించగా, అదే బాటలో మరికొన్ని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా  ప్రపంచంలోనే నంబర్‌వన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై వేటు (Microsoft Layoffs) వేయనుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. వారంతా మానవ వనరులు (HR), ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని తెలిపాయి. కంపెనీలో గత జూన్‌ 30 నాటికి మొత్తం 2 లక్షల 21 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. వారిలో 1 లక్షా 22 వేల మంది అమెరికాలో పనిచేస్తుండగా, 99 వేల మంది వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. కాగా, మెక్రోసాఫ్ట్‌ (Microsoft Layoffs) గత అక్టోబర్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

Harnaaz Sandhu Emotional Video:స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్న మాజీ విశ్వసుందరి హర్నాజ్‌ సంధు, బొన్ని గాబ్రియేల్‌కు విశ్వ సుందరి కిరీటాన్ని తొడిగిన భారత్ అందగత్తె  

ఆర్థిక మాంద్యం భయాలు, డిమాండ్ తగ్గిపోవడంతో అమెజాన్(Amazon), మెటా సహా అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్‌ రెండు విడుతల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించగా, మెటా 11 వేల మందిపై వేటు వేసింది. కాగా, క్లౌడ్ సేవ‌ల్లో అజూర్‌పై ఎక్కువ‌గా దృష్టిపెడుతుండ‌టంతో మైక్రోసాఫ్ట్‌లో పాత టెక్నాల‌జీల‌కు సంబంధించి ఉద్యోగులను తొల‌గించ‌నున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువ‌డ్డాయి. ప్రస్తుతం ఉన్న ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల ప్రక్రియను కూడా క్లౌడ్‌ సర్వీస్‌కు మార్చే ఆలోచనలో సంస్థ ఉన్నది.