ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. ఉద్యోగులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. కంపెనీలో ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకోవాలనే నెపంతో ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తూ (layoff more employees) వస్తున్నారు. ఇప్పటికే కంపెనీ నుంచి 3400 మందిని ఇంటికి సాగనంపిన విషయం తెలిసిందే.
వీరితో పాటు డబ్లిన్, సింగపూర్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు డజనుకు పైగా ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు (Twitter Plans to Layoff) వారం క్రితం వార్తలు వెలువడ్డాయి. తాజాగా మరో 50 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తున్నది. వీరంతా ప్రొడక్ట్ విభాగంలో పనిచేస్తున్నారని, రానున్న వారాల్లో వీరిపై వేటు పడనున్నట్లు ఇన్‌సైడర్ అనే వార్తా సంస్థ తెలిపింది. కంపెనీ ఉద్యోగులను 2 వేల లోపు పరిమితం చేయాలని మస్క్ భావిస్తున్నట్లు పేర్కొన్నది.