Thailand Nightclub Fire: నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం, 13 మంది సజీవ దహనం, మరో 40 మందికి పైగా గాయాలు, థాయ్‌లాండ్‌లో విషాద ఘటన
ఈ విషాద ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు.
థాయ్‌లాండ్‌లోని నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌స్పాట్ నైట్‌క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్ మొత్తానికి మంటలు విస్తరించడంతో 13 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుగంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నైట్‌క్లబ్ మొత్తం కాలిపోయింది.