Landslide Hit Malaysia: మలేషియాలోని కౌలాలంపూర్ శివార్లలో విరిగిపడ్డ కొండచరియలు.. ఇద్దరు మృతి, 51మంది గల్లంతు

రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని క్యాంప్‌సైట్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 51 మంది భాధితులు గల్లంతయ్యారు.

Credits: Twitter

Kuala Lumpur, Dec 16: మలేషియాలో (Malaysia) ఘోరం జరిగింది. రాజధాని కౌలా లంపూర్ (Kuala Lumpur) శివార్లలోని క్యాంప్‌సైట్‌లో కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 51 మంది భాధితులు గల్లంతయ్యారు. వీరిని కనిపెట్టేందుకు ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు (Rescue Operations)  చేపట్టారు. అయితే కొండచరియలు విరిగిపడినప్పుడు మొత్తం 79 మంది శిబిరంలో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో 23మంది క్షేమంగా బయటపడ్డారని, మరో ముగ్గురికి గాయాలయ్యాయని ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

పూరి ఆలయంలో స్మార్ట్‌ ఫోన్లపై పూర్తి నిషేధం.. భక్తులతో పాటు పోలీసులు, ఆలయ సిబ్బందికీ ఇదే నిబంధన.. జనవరి నుంచే అమలు

30 మీటర్ల ఎత్తులో నుంచి కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 2:24 గంటలకు సమాచారం తెలిసిన వెంటనే  రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.